గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష టన్నుల చెత్తతో దుర్గంధం భరించాం.!

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష టన్నుల చెత్తతో దుర్గంధం భరించాం.!
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : డ్రైన్ల ద్వారా వచ్చే మురుగునీరును శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడానికి రూ.75 కోట్ల వ్యయంతో శుద్ధి కేంద్రం నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో శనివారం తెలిపారు.
స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా “జలం జీవం” కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి చెరువు వద్ద శుభ్రత నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్థానిక చెరువును రూ.2.70 కోట్లతో సుందరీకరణ చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మచిలీపట్నంలో లక్ష టన్నుల చెత్త పేరుకుపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ప్రస్తుతం తొలగింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.
