19 నుండి ఆలేరులో ఉచిత యోగా శిక్షణ..
ఆలేరు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 19, 20,21 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉచిత యోగ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు బండిరాజుల శంకర్ ఆదివారం తెలిపారు. వివేకానంద యోగా కేంద్రం, అంతర్జాతీయ ధ్యాన సంస్థ హార్ట్ ఫుల్నెస్ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్ లో ప్రకటించిన మూడు రోజులపాటు ఉదయం 6 గంటల 7.45 వరకు యోగా శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈనెల 18న సాయంత్రం 5 గంటలకు పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ధ్యానోత్సవం పేరిట నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో 10 సంవత్సరాలు దాటిన బాలబాలికలు యువతీ యువకులు, మహిళలు, పురుషులు పాల్గొనవచ్చని చెప్పారు. ఈ ఉచిత యోగా శిక్షణలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు 9948050608, 6305396011 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
