కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం

కడెం, ఆంధ్రప్రభ : “మన గ్రామం – మన ఆరోగ్యం” కార్యక్రమంలో భాగంగా కడెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరాన్ని పిహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్ పర్యవేక్షించారు. శిబిరంలో జిల్లా ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ స్వర్ణ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ డి. సాయి కృష్ణ పాల్గొని గర్భిణీ మహిళలు, మహిళలు, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు పంపిణీ చేసి, ఆరోగ్యంపై తగిన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో పిహెచ్‌సీ సూపర్వైజర్ నిర్మల, పరిధిలోని ఏఎన్‌ఎంలు, సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.