గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి…

వెల్డండ, ఆంధ్రప్రభ ; గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం అంటూ వెల్దండ స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకట గౌడ్ అన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలినికి చెందిన7వ వార్డులో మంగళవారం సిసి రోడ్ పనులకు భూమి పూజ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు మారేపల్లి మంజుల శ్రీను, ముదికొండ కవిత రమేష్ , పిల్లి దేవేందర్, ఎస్ శేఖర్, మాసుల బాలరాజు, జంగిలి ఆనంద్, నాయకులు కొయ్యల పుల్లయ్య ,క్యాసరపు మల్లేష్,ఈదులపల్లి శ్రీనివాస్, బాదేపల్లి రామకృష్ణ,సాదమోని శ్రీనివాస్, అన్నెపు వెంకటయ్య, సురేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply