వెల్లంపల్లిలో ఉచిత రక్తదాన శిబిరం..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో జై భీమ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పరకాల గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. అధ్యక్షులు బొట్ల అరుణ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనేక మంది యువకులు రక్తదానం చేయగా, కాకి సారంగపాణి రక్తదాతలకు ఫ్రూట్స్ మరియు గుడ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మచ్చ మహేందర్, మాజీ సర్పంచ్ వేలగందుల కృష్ణ, శనిగరపు రాజు, బిగ్ బాస్ , బొట్ల జయపాల్, కేతపాక రవి, మచ్చ సురేష్, వంగర రాజు, జి ఎం కుమారస్వామి , నుటంకి రమేష్, బొట్ల రత్నాకర్, తెలంగాణ చందు, తిక్క గణేష్, హేమంత్ అనిల్, బరిగెల అనిల్, బరిగెల సాయి, వడ్ల నవీన్, గజ్జి నిష్, తిక్క జింటు, జై భీమ్ యూత్ తరఫున సలహాదారులు మచ్చ వినోద్, ఇంచార్జి కాకి శరత్ చంద్ర, కార్యదర్శి మచ్చ టెనం, ఆర్గనైజర్ భవేష్, కోశాధికారి సుమంత్, ఏకు శ్రీనివాస్, పెండెల దుర్గాప్రసాద్, మచ్చ చరణ్ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
