పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పేద ప్రజల ఆర్థిక భరోసా, మహిళా సంక్షేమం, వైద్య సేవల మెరుగుదలకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి రూరల్, అర్బన్, ఘనపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన 46 మందికి రూ.18,45,700 విలువైన చెక్కులు, ఘనపూర్ మండలానికి చెందిన 31 మందికి రూ.9,74,300 విలువైన చెక్కులను అందజేశారు.

అదేవిధంగా 23వ వార్డు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం ఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ , డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొంరయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కిషన్, అశోక్ ,అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.