రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : నియోజవర్గ కేంద్రమైన అశ్వారావుపేట లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం పట్టణంలోని కెమిలాయిడ్స్ సంస్థలో పనిచేస్తున్న చిట్లూరి కృష్ణయ్య(57), కొవ్వాసి నాగరాజు(25)లు మరో ముగ్గురు కలిసి ట్రాక్టర్ పై పట్టణంలోని ఫ్యాక్టరీ వ్యర్ధపదార్ధాలు పోసే చోటుకు వెళుతుండగా స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో సంఘటన స్థలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
ట్రాక్టర్లో ప్రయాణం చేస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అవటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. సంఘటన పై సీఐ నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
