మత సామరస్యానికి ప్రతీక మొహర్రం..

  • ఘనంగా మొహర్రం వేడుకలు..

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : మొహర్రం పండుగ పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల ముస్లింలు పీరీలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ప్రజలు హిందూ ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పీరీలను వాడ వాడలా ఊరేగించి యువకులు నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా జరపగా ప్రజలు పిరీలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ముస్లింలు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరాజుద్దీన్ పాషా, బడేమియా, కాసిం షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.