పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లు, కూటమి నేతలు..
భవానీపురం, ఆంధ్రప్రభ : మొక్కల పెంపకంతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యతని ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లు కూటమి నేతలు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవానిపురం ఎన్డీఏ కార్యాలయం ఆవరణ, పరిసర ప్రాంతాలలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి మాజీ కార్పొరేటర్లు , కూటమి నేతలు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నేతలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద ప్రతి ఒక్కరూ ఒక మొక్కనైనా నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, మహాదేవు అప్పాజీరావు , మహ్మద్ అబ్దుల్ ఖాదర్, కూటమి నేతలు కొప్పుల అరుణశ్రీ, బొమ్ము గోవింద లక్ష్మీ,కామ దేవరాజ్, కొప్పుల గంగాధర్ రెడ్డి, పీవీ చిన సుబ్బయ్య, దుర్భేసుల హుస్సేన్, రెడ్డిపల్లి రాజు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, పచ్చవ మల్లికార్జునరావు, చొక్కా నరేష్, ధనాల కోటేశ్వరరావు,పార్క్ సూపర్వైజర్ గరే రమణ, పార్కు సిబ్బంది పాల్గొన్నారు.
