అంకమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు

దమ్మపేట, ఆంధ్రప్రభ ; దమ్మపేట మండలం దురదపాడు గ్రామంలో అంకమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవంలో బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బిఆరెస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు దర్శించుకున్నారు.

అంకమ్మ తల్లిని దర్శించుకుని , ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు తాటి , మెచ్చాను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో కాసాని నాగ ప్రసాద్ ,లక్ష్మణరావు , పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply