వినతి పత్రం కోసం వెళ్లి… తిరిగిరాని మార్గం!

వినతి పత్రం కోసం వెళ్లి… తిరిగిరాని మార్గం!
సత్తుపల్లి, ఆంధ్రప్రభ: సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీలో పాలకుర్తి ఆదినారాయణ (68) సోమవారం మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆయన మృతికి వడదెబ్బ కారణమై ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు.
భూ వివాదానికి సంబంధించి వినతి పత్రం సమర్పించేందుకు ద్విచక్ర వాహనంపై పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆదినారాయణ, తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. వడదెబ్బ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, సరైన వైద్యం అందక మృతి చెందినట్లు వారు ఆరోపించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
