ఊట్కూర్‌లో ఘనంగా జిల్లా స్థాయి భజన పోటీలు

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి భజన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు.
పోటీల్లో మొదటి బహుమతి రూ.10,016 జంగంరెడ్డి పల్లి వీరాంజనేయ భజన మండలికి లభించింది. రెండో బహుమతి రూ.8,016 పల్లెగడ్డ సీతారామాంజనేయ భజన మండలికి, మూడో బహుమతి రూ.6,016 మంథన్‌గోడు దత్తాత్రేయ భజన మండలికి, నాలుగో బహుమతి రూ.4,016 జక్కన్నపల్లి శివరామాంజనేయ భజన మండలికి, ఐదో బహుమతి రూ.2,016 పులిమామిడి రామలింగేశ్వర భజన మండలికి అందజేశారు.
సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్యతో పాటు నగదు బహుమతుల దాతలు గవినోళ్ల హన్మి రెడ్డి, గవినోళ్ల భీమ్ రెడ్డి, తులసిదాస్, నగేష్ గౌడ్, పోలీస్ నర్సింహా రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని నిర్వాహకులు సుధాకర్ రెడ్డి, దోరోళ్ల కృష్ణయ్య, దాసరి రామాంజనేయులు తెలిపారు.
ఈ జిల్లా స్థాయి భజన పోటీల్లో మొత్తం 31 భజన బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, హరినామ సంకీర్తనలను రాబోయే తరాలకు పరిచయం చేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. భజనల ద్వారా దైవభక్తి, దేశభక్తి, సమాజ సేవ వంటి గుణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చాకలి వెంకటప్ప, ప్యాట శ్రీనివాస్, నేడుగం రాఘవేందర్, అశోక్ గౌడ్, కె. నర్సింహా రెడ్డి, భూపాల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, రాజప్ప, హెచ్. నర్సింహా, మహేష్ గౌడ్, వెంకప్ప గౌడ్, ఉప్పు ఆంజనేయులు, పత్తి ఆంజనేయులు, రాజమూరి, వెంకటప్ప, అశోక్, రామలింగం గౌడ్, నాగిరెడ్డి, హన్మిరెడ్డి, దత్తప్ప, గుంతలి కుర్మప్ప, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
