Chityala | తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విద్యా కమిటీ చైర్మన్‌గా పందిరి గీత

Chityala | తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విద్యా కమిటీ చైర్మన్‌గా పందిరి గీత

  • హైదరాబాద్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం

చిట్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని చంపాపేట సరస్వతి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణానికి చెందిన పందిరి గీతా రమేష్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విద్యా కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా పందిరి గీత మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు రాయపూడి భవాని ఉమాశేఖర్‌తో పాటు ఇతర ఆర్యవైశ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగ అభివృద్ధికి, ఆర్యవైశ్య విద్యార్థుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

అనంతరం చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్‌ను రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాయపూడి భవాని ఉమాశేఖర్, ఇతర కార్యవర్గ సభ్యులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.