Former CM | కృష్ణలంకలో బాధిత కుటుంబానికి మాజీ సీఎం ధైర్యం
Former CM | కృష్ణలంకలో బాధిత కుటుంబానికి మాజీ సీఎం ధైర్యం
- లాకప్ మరణం ఆరోపణలపై తీవ్ర ఆవేదన
Former CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. సాయికృష్ణ నివాసానికి చేరుకున్న జగన్, ఆయన తల్లి గాదె విజయలక్ష్మిని కలిసి ఓదార్పు తెలిపారు.
సాయికృష్ణ మరణం చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల నుంచి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణను లాకప్‌లో కొట్టి చంపారని, అనంతరం మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు చూపకుండా వ్యవహరించారని కుటుంబం ఆరోపిస్తోంది.
అలాగే సాయికృష్ణ మృతదేహాన్ని అర్థరాత్రి సమయంలో దహనం చేయించారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్, వారికి ధైర్యం చెబుతూ న్యాయం జరిగేలా పోరాడుతామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
