ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
- చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ
మునుగోడు, ఆంధ్రప్రభ: ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ కోరారు.నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపల్పుల గ్రామంలోని మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో గురువారం ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
బడిబాట కార్యక్రమంలో భాగంగా గత రెండు రోజులుగా 30 మంది నూతన విద్యార్థులను పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంభంపాటి జ్యోతి వెంకటేష్, ప్రధానోపాధ్యాయురాలు డి. కళావతి, పీఆర్టీయూటీఎస్ మునుగోడు అధ్యక్షుడు యూసుఫ్ పాషా, ఉపాధ్యాయులు రవీందర్, రోహిణి, నాగరాజు, స్వామి, మేరీ తదితరులు పాల్గొన్నారు.
