advocate|తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్
advocate|తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్
తెలంగాణకు చెందిన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్
డిమాండ్లపై సుప్రీంకోర్టు కొలీజియం సహా సంబంధిత అధికారులకు వినతిపత్రాలు..
అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిక
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు చెందిన అర్హులైన న్యాయవాదులకు ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (THCAA) డిమాండ్ చేసింది. రాష్ట్రానికి చెందిన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ కోరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కొలీజియం, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు పంపాలని THCAA నిర్ణయించింది. తెలంగాణ న్యాయవాదుల న్యాయమైన ప్రాతినిధ్యం కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని అసోసియేషన్ ప్రకటించింది.
