CM | రైతన్నా మీ కోసం..

CM | రైతన్నా మీ కోసం..


పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు మండలం పెనమలూరు – చోడవరం రోడ్డులో వ్యవసాయశాఖ (Department of Agriculture) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ రైతులతో అధిక దిగుబడి, వాణిజ్య పంటలలో అంతరపంటలు సాగు చేయడం, సేంద్రీయ ఎరువుల ప్రాముఖ్యత తదితర విషయాలను తెలియచేశారు. రైతులు ధాన్యం తరలిస్తుండగా, జెండా ఊపి ప్రారంభించారు. తొలుత వరి పంట పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.