Accident | ఘోర ప్రమాదం..

Accident | ఘోర ప్రమాదం..

Accident, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లా, అల్లూరు మండలం, సింగపేట సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు బండ్ల ప్రసాద్, ఉప్పాల శీనయ్యగా గుర్తించారు. కావలి మండలం, బట్లదిన్నే గ్రామం నుండి కూలి పనుల నిమిత్తం అల్లూరుకు ప్రయాణం చేస్తున్నారు. వాహనంలో 8 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సింగంపేట సమీపంలో బొలెరో వాహనం ఛాయిస్ విరిగి బోల్తా పడినట్టు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply