గ్రామంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: గ్రామంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు భీమ్‌గల్ మండలం పిప్రి (జె) గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ తెలిపారు.గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యా అధికారి బాలకిష్టను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిప్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, భవిష్యత్ విద్యా అవకాశాలపై చర్చించారు.
గ్రామ విద్యాభివృద్ధికి అవసరమైన సూచనలను ఉన్నత విద్యా అధికారి నుంచి స్వీకరించిన సర్పంచ్ జనార్ధన్, పిప్రి గ్రామ విద్యార్థులు విద్యారంగంలో మరింత ముందుకు సాగేలా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.ఫొటో రైటప్: పిప్రి గ్రామ విద్యాభివృద్ధి అంశాలపై తెలంగాణ ఉన్నత విద్యా అధికారి బాలకిష్టతో చర్చిస్తున్న సర్పంచ్ అరిగెల జనార్ధన్.
