ఉపాధి కూలీల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

ఉపాధి కూలీల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో బుధవారం ఉపాధి హామీ కూలీల పని ప్రదేశంలో సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని ( చలి వేంద్రాన్ని ) కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ పంచాయతీ పాలక వర్గంతో కలిసి ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ కూలీల దాహార్తి తీర్చేందుకు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలకు ప్రతి రోజూ తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం పనుల్లో వేడి నుంచి ఉపశమనం కల్పించి కూలీల దాహార్తి తీర్చేందుకే చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లోలం సురేష్,మామిడి అక్షయ్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ, మేట్లు అరుణ, రాజు, జలంధర్, శరణ్య, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
