Suicide Attempt | టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

Suicide Attempt | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ‌లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ఓ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం మేనత్త మరణించడంతో పాటు కుటుంబ సభ్యులకు దూరంగా హాస్టల్‌లో ఉండటం వల్ల బాలుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాస్టల్‌లో రబ్బర్లతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే బాలుడి చర్యను గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో విద్యార్థి ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థి మానసిక పరిస్థితిపై వివరాలు సేకరిస్తూ, సంఘటనకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.