రాయపర్తిలో చలివేంద్రం ప్రారంభం..

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ప్రజలు, ప్రయాణికుల వేసవి దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ఎంపీడీఓ జి. కిషన్ నాయక్ స్థానిక సర్పంచ్ సహేంద్ర బిక్షపతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, దాహంతో ఇబ్బంది పడకుండా చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు ఎండ తీవ్రంగా ఉన్నందున ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తప్పనిసరిగా తలకు టోపీ లేదా తలపాగా ధరించాలని సూచించారు.

వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి, తరచుగా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ రమేష్, గ్రామపంచాయతీ సెక్రటరీ వల్లె వినోద్, కారోబార్ రామచంద్రయ్య, వార్డు మెంబర్లు కుంట రాంబాబు, కుంట రాజు, ఐత కంతుల రవళిజంపి , దురిశెట్టి స్వప్నయాకయ్య, గారే కళ్యాణివిష్ణు, ఐత జమున, గ్రామ ప్రముఖులు ఎండి నయీమ్, పెద్ద గోల్ల రాజు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply