ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం స్టేజి వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నె శివారెడ్డి తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగోని నవీన్ యాదవ్, బోసి హరిబాబు, తీగల రాజు, అనుమాస్పేట లింగస్వామి, కళ్లెం దయాకర్ రెడ్డి, ఎర్రగోని లింగస్వామి, శివమహదేవ దేవాలయ చైర్మన్ బండమీది ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో….

భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కడారి కల్పనా అయిలయ్య యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రమణగొని శంకరయ్య, 2వ వార్డు కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, 6వ కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, నాయకులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పిల్ల బుచ్చయ్య, ఊదరి రంగయ్య, ఎర్ర నరసింహ, బొడ్డు యాదయ్య, పిల్ల శ్రీధర్, ఎర్ర శ్రీకాంత్, తూర్పునూరి నరసింహ, బూత్ అధ్యక్షులు బాతరాజు ప్రవీణ్, ఇటికాల దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply