రామన్నగూడెం తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం

రామన్నగూడెం తండాలో విద్యుత్ సమస్యకు పరిష్కారం
రేగొండ, ఆంధ్రప్రభ: రామన్నగూడెం తండా గ్రామంలో చాలా కాలంగా ఉన్న విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో పరిష్కారం లభించింది.
గతంలో పాలకుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్యను గ్రామస్థులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్పందించి గ్రామంలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్లను ఊరు బయటకు మార్చేందుకు చర్యలు చేపట్టారు.
రూ.4 లక్షల వ్యయంతో ఎలక్ట్రిసిటీ సిబ్బంది సహకారంతో విద్యుత్ లైన్ల మార్పు పనులు పూర్తి చేశారు. దీంతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ తక్కువ సమయంలోనే గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గ్రామస్థులు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో ఈ పని పూర్తయిందని పేర్కొన్నారు.
గ్రామ సమస్యను గుర్తించి పరిష్కారం చూపిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు, గ్రామ సర్పంచ్ బానోత్ రవళిక-వీరునాయక్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పనులు పూర్తి చేసిన ఎలక్ట్రిసిటీ సిబ్బందికి సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
