భాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఖమ్మం మల్లయ్య(63) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నామని జగన్నాధం మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి కుటుంబ సభ్యులకు రూ.10 వేల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య,భీమగాని మల్లేశం,పగిళ్ల యాదయ్య, మాదగాని సత్తయ్య,ఖమ్మం రాములు,ఖమ్మం రామస్వామి,ఖమ్మం నరసింహ,ఖమ్మం అబ్బయ్య,ఖమ్మం పాండు, ఖమ్మం శేఖర్,ఖమ్మం శ్రీనివాస్,శ్రీశైలం,స్వామి,వడ్డేపల్లి సైదులు,మొద్దు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
