ఆలేరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకం

ఆలేరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో నలుగురు కో ఆప్షన్స్ సభ్యుల నియామకం కోసం ప్రత్యేక సమావేశం మంగళవారం చైర్మన్ బీజన బాలమణి అధ్యక్షతన జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఎం ఎస్ విజయ్ కుమార్, చింతకింది మురళి, గుత్తా శమంతారెడ్డి, సిపిఎం కు చెందిన ఇంతియాజ్ ఇర్ఫానా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు.

ఎన్నికైన వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, పస్తం ఆంజనేయులు, మల్లెల సరిత, జెట్ట నీరజ, వానరాశి మరియమ్మ, బీజన కళ్యాణి, మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply