సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

వేల్పూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రైతు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి బి రాజు పేర్కొన్నారు.శుక్రవారం మండలంలోని వేల్పూర్ రైతు వేదిక భవనంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలు అవగాహన సదస్సునిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు.తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని తెలిపారు..
ఏవో బి రాజు మాట్లాడుతూ.. పీఎం కుసుం పథకం కింద వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో సోలార్ ప్యానల్స్ అమర్చే విధానంపై సోలార్ కనెక్షన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానంపై రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ యశ్వంత్ రెడ్డి ,ఏఈఓలు సౌజన్య సాయిరాం రాజు రైతులు ఫర్టిలైజర్ డీలర్స్ ,తదితరులు పాల్గొన్నారు.
