Rs113 cr | జాతీయ జట్టులోనే కొనసాగించాలన్న సీఏ
Rs113 cr | జాతీయ జట్టులోనే కొనసాగించాలన్న సీఏ
Rs113 cr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌కు భారీ మెగా డీల్ వరించినట్లు సమాచారం. అంతర్జాతీయ టీ20 లీగ్‌ల నుంచి వస్తున్న భారీ ఆఫర్ల నేపథ్యంలో.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతడిని జాతీయ జట్టులోనే కొనసాగించేందుకు దాదాపు రూ.113 కోట్ల విలువైన ప్రత్యేక ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
మూడేళ్ల కాలానికి సుమారు 12 మిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్ ప్రకారం.. కమిన్స్ ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో పూర్తిస్థాయిలో ఆడేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఇటీవల ఓ ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వివిధ టీ20 లీగ్‌లలో ఆడేందుకు కమిన్స్‌కు సుమారు రూ.62 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు రావడంతో సీఏ అప్రమత్తమైనట్లు సమాచారం.
లీగ్ క్రికెట్ కంటే జాతీయ జట్టుకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కల్పించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారైతే.. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ నిలవనున్నాడు.
CLICK HERE TO READ MORE : ipl 2026 today match |ఇవాళ లక్నో, బెంగళూర్ ఢీ
