జడ్పీహెచ్‌ఎస్ కమ్మర్ పల్లి పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : జడ్పీహెచ్‌ఎస్ కమ్మర్ పల్లి పాఠశాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.ర్యాలీని ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా నినాదాలు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య,ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫారాలు మరియు ఇతర సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు.పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్,గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యక్రమానికి తమ పూర్తి సహకారాన్ని అందించారు.ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.వార్డు సభ్యులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.వీడీసీ చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ మరియు సభ్యులు ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

ప్రభుత్వ విద్యాభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆశా వర్కర్లు కూడా ర్యాలీలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. విద్యార్థినీ, విద్యార్థులు క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.ప్రజల నుండి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమం సాగింది.అందరి సహకారంతో బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Leave a Reply