ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : దాన్యం తూకం వేసి నాలుగు రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని నిరసిస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని మాలుతుమ్మెద గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

దాన్యం రవాణా కోసం లారీ డ్రైవర్లు ఒక్కో సంచికి రూ.2 అదనంగా చెల్లిస్తేనే వస్తామని, లేకపోతే రామని మొండికేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో దాన్యం నిల్వలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.

తక్షణమే లారీ సమస్యను పరిష్కరించి దాన్యం తరలింపును వేగవంతం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Leave a Reply