రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

కాంగ్రెస్ కిసాన్ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బరుపటి రమేష్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బరుపటి రమేష్ వర్మ అన్నారు బుధవారం మండల కేంద్రమైన కడంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేసి వారి వారి ఖాతాల్లో నిధులను జమ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు రెండు ఎకరాల లోపు రైతులందరికీ తొలి విడతలో రైతు భరోసా నిధులు వేయడం జరిగిందన్నారు రెండవ మూడవ విడుదల లో కూడా రైతులకు రైతు భరోసానిధులు వేయడం జరుగుతుందన్నారు ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున రైతు భరోసనిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏకకాలంలోనే రైతులకు రెండు లక్షల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల సంక్షేమం రైతుల అభివృద్ధి రైతుల మేలుకోరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు రైతుల పంటలకు సాగునీరు అందించే జలాశయాల అభివృద్ధి కోసం చెరువుల అభివృద్ధి కోసం కాల్వల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.