ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం..

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారంనాడు మండలస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ బి. శ్రీనివాస్ తెలిపారు. జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే మండలస్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ముఖ్యంగా పంచాయతీరాజ్శాఖ, గ్రామీణ అభివృద్ధిశాఖ పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖ, వ్యవసాయశాఖ, విద్యుత్ శాఖ, గృహ నిర్మాణ తదితర శాఖలు అందిస్తున్న సేవలను వివరించడం జరుగుతుందన్నారు.

దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, వరిధాన్యం బోనస్, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకంపై గురించి ప్రజలు తెలియపరచటమే కాకుండా అర్హులందరు లబ్ధి పొందేవిధంగా, ఈ మండలిస్థాయి సమావేశమం ఎంతో దోహదపడుతుందన్నారు. సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply