సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :ఎవరెంత చెప్పినా, ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నా పాకిస్తాన్ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదని, భారత్ దాడులతో కాళ్ల బేరానికి వచ్చింది కానీ, మళ్లీ వెనుక నుంచి గోతులు తవ్వేందుకు సిద్ధమయ్యిందని నిఘా వర్గాలు అంటున్నాయి. దీనికి నిదర్శనమే పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలని రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నిషేధిత సంస్థ జమాత్-ఉద్-దవా పాకిస్తాన్లోని ప్రాన నగరాల్లో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడామే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. అయితే.. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలాంటి వాటితో సహా మొత్తం 50సిటీస్లో భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీలను నిర్వహించినట్టు సమాచారం. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా పాల్గొనడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పీఎంఎంఎల్ సమావేశాలు సమాఖ్య, పంజాబ్, సింధ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఎక్కువ ర్యాలీలు జరిగినట్టు తెలుస్తోంది.పాక్ ఆర్మీతో కలిసి కుట్ర..ఉగ్ర లీడర్ హఫీజ్ సయీద్ నిర్వహించిన ఈ ర్యాలీలో పాక్ మంత్రులు, ఆర్మీ కూడా పాల్గొంటోంది. ఈ ర్యాలీల్లో ఉగ్రవాద నాయకుల ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తుంటే పాకిస్తాన్ మరో దాడికి ప్లాన్ చేస్తోందని అనుమానం బలపడుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మే 28వ తేదీన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భారత్కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ జరిగింది. ఇందులో ఆ దేశపు మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇందులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా పాల్గొంటున్నారు. వీరు భారత్లో అశాంతిని రెచ్చగొట్టాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. బోర్డర్‌లో అలర్ట్.. మాక్ డ్రిల్స్ నిర్వహణ..ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్.. భారత్లో మరో దాడికి కుట్ర చేస్తున్నాడని.. దాని కోసమే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాడని నిఘా వర్గాలు అంటున్నాయి. పాక్ ఆర్మీతో కలిసి.. భారత సైన్యాన్ని దెబ్బకొట్టేలా పుల్వామా మాదిరి ఎటాక్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, మంత్రులు కూడా హఫీజ్ సయీద్ ర్యాలీలకు అటెండ్ అవడం, అక్కడ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడ్డం చూస్తుంటే మరో దాడి పక్కా అని తెలుస్తోందనే వాదనలు ఉన్నాయి. పుల్వామా తరహాలో ఈ దాడి ఉండొచ్చునని అంటున్నారు. అప్పుడు కూడా పాక్ ఆర్మీ సహకారంతోనే ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేశారు. ఇప్పుడూ అలాంటిదే ప్లాన్ చేసి ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకనే ముందస్తు అలర్ట్గా బోర్డర్ జిల్లాల్లో భారత్ సైన్ ప్రజలను అప్రమత్తం చేస్తోందని, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
Exclusive | ఉగ్ర దాడులకు.. పాక్ స్కెచ్!మరో కుట్ర బహిర్గతం
