రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ కుమారుడు మృతి

  • అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామెల్

మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఎలుగు యాదయ్య–పార్వతమ్మ దంపతుల కుమారుడు సందీప్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గురువారం గ్రామానికి చేరుకుని సందీప్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.అనంతరం జరిగిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే సామెల్ పాల్గొని మృతుడికి తుది వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.