కెసిఆర్ అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నాం

కెసిఆర్ అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నాం

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మక్తల్ , ఆంధ్రప్రభ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అలుపెరగని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించకున్నామని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం బిఆర్ఎస్ గులాబీ జెండాను ఆవిష్కరించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చి తప్పని పరిస్థితుల్లో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాల్సిన పరిస్థితి కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు .కేసీఆర్ పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రాణాలు అడ్డుపెట్టి సాధించిన కేసీఆర్ పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేశారని అన్నారు .కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంటు అందించడంతోపాటు వ్యవసాయ రంగాన్ని వలసలు వెళ్లిన తెలంగాణకే ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా కేసీఆర్ దేనని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 420 హామీల మాయలో పడ్డ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే గడిచిన రెండున్నరేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు .మళ్ళీ సారే రావాలి తెలంగాణ అభివృద్ధి జరగాలి అంటూ తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా రాబోయే రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ఆదిశగా పార్టీ శ్రేణులు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికి అక్కడ ఎండ కడుతూ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, మాజీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, నాయకులు చిన్న హన్మంతు, అన్వర్ హుస్సేన్,జగ్గలి రాములు, మొగులప్ప ,బండారి ఆనంద్, మహమూద్ ,జుట్ల శంకర్, ఈశ్వర్ యాదవ్ ,నేతాజీ రెడ్డి , జె.సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply