వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చిన్ననాటి నుంచే లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిరమేష్ ,మునిసిపల్ ఛైర్మెన్ తీగల సునేంద్ర కుమార్ ,టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు ,కౌన్సిలర్స్ నిజాం ,ఆసిఫా బేగం ఖాదర్ ,శంకర్,కూచుకుళ్ల సింధు ,వసంత సంతోష్ గౌడ్ ,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
