పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత…

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత…

  • అదనపు జిల్లా న్యాయమూర్తి స్వప్న రాణి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని అదనపు జిల్లా న్యాయమూర్తి స్వప్న రాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు జిల్లా న్యాయమూర్తి స్వప్న రాణి మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, నీటి సంరక్షణ పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవడం అవసరమని సూచించారు.

పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కరోనా వచ్చినపుడు ప్రతి ఒక్కరం కూడా ఆక్సిజన్ దొరకక ఇబ్బంది పడ్డామని తెలిపారు.

భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు వచ్చిన ఎదుర్కునే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మంజుల, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్, ప్రభుత్వ న్యాయవాది మార కిషోర్, బార్ అసోసియేషన్ కార్యదర్శి రాచూరి శ్రీకాంత్, న్యాయవాదులు, జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పర్యావరణానికి సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

Leave a Reply