నూతన డీసీసీ బ్యాంక్ శాఖ ప్రారంభం..

దేవరుప్పుల, ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ శాఖను శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభంగా రుణాలు, పొదుపు సేవలు, ఇతర బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంలో డీసీసీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఖాతాదారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. నూతన శాఖ ప్రారంభంతో మండల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు.