ముఖరా కే మాజీ సర్పంచ్‌కు ఘన సత్కారం..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ముఖరా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కి అవార్డు ను జిల్లా పాలానాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్, డి ఎఫ్ ఓ బాజీరావ్ లు అందజేశారు.ముఖరా కే మాజీ సర్పంచ్ గతంలో గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారని, అధికారులు అన్నారు.గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్, హారిత వనంలో, పార్కులో, బృహత్ పార్కులో, గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటారని, మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతి మొక్కను కాపాడటం కోసం దేశం లో ఎక్కడ లేని విధంగా చెట్లకు డిజిటల్ ట్రీ ఆధార్ గుర్తింపు ఇచ్చిన తొలి గ్రామం ముఖరా కే అని, నాటిన ప్రతి మొక్కను కాపాడి నేడు గ్రామంలో ఎక్కడ చుసిన ఆకుపచ్చని మొక్కలే కనబడుతున్నాయి అని,గ్రామంలో వచ్చే వారికి రోడ్డుకు నాటిన చెట్లు హారిత స్వాగతం పలకుతున్నాయి అని, పర్యావరణ పరిరక్షణ కు పాటు పడిన గాడ్గే మీనాక్షి ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా అవార్డు అందజేశారు…