TG – సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఐకానిక్ భ‌వ‌నం నేట‌మ‌ట్టం

క‌నుమరుగైన మరో పురాత‌న క‌ట్ట‌డం
1847 లో నిజాం నవాబు లో శ్రీకారం
1952 లో నాటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం

సికింద్రాబాద్ – తెలంగాణ రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలు నేలమట్ట మయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1916వరకు నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే(ఎన్‌జీఎ్‌సఆర్‌)కు ఇదే ప్రధాన స్టేషన్‌గా ఉండేది. 1951లో ఎన్‌జీఎ్‌సఆర్‌ను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్ లో సికింద్రాబాద్‌ స్టేషన్‌ భాగమైంది. 1952లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీని పోర్టికో నిజాం ఆర్కిటెక్చర్‌కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రూ.720 కోట్ల వ్య‌యంతో సికింద్రాబాద్ స్టేష‌న్ ను అధునీక‌రిస్తున్నారు. మరో ఏడాదిలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎయిర్‌పోర్టును తలపించేలా మారనుంది. చేపట్టిన స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐకానిక్ భ‌వ‌నాన్ని నేడు కూల్చివేశారు.

Leave a Reply