Ongole Lawyer Murder | న్యాయవాది హత్య కేసులో సంచలన విషయాలు

Ongole Lawyer Murder | న్యాయవాది హత్య కేసులో సంచలన విషయాలు

Ongole Lawyer Murder | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రకాశం జిల్లా ఒంగోలులో యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మృతుడి భార్య నాగజ్యోతే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారడంతో అతడిని హత్య చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నాగజ్యోతి, కానిస్టేబుల్ వెంకట కోటయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ సంబంధానికి హరిప్రసాద్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ అతడిని హత్య చేసేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు.

ముందుగా హరిప్రసాద్ పేరుతో భారీ బీమా చేయించిన నిందితులు, అనంతరం అతడికి అధికంగా మద్యం తాగించినట్లు పోలీసులు తెలిపారు. స్పృహ కోల్పోయిన తర్వాత హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.

మొదట ప్రమాద మరణంగా కనిపించిన ఈ కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సాక్ష్యాలను సేకరించి అసలు విషయాన్ని వెలికితీశారు. దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో కేసు హత్యగా మారిందని తెలిపారు. కేసులో ప్రధాన నిందితురాలిగా గుర్తించిన నాగజ్యోతిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Leave a Reply