కంట్లో కారం చల్లి వృద్ధురాలి పుస్తెలతాడు అపహరణ

పాలకుర్తి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో పుస్తెలతాడు దొంగతనం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుర్ర పోశవ్వ (65) ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్న సమయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఆమె కంట్లో కారం చల్లి, మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించినట్లు సమాచారం.

సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బసంత్‌నగర్ ఎస్‌ఐ నూతి శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.