కేసముద్రం విలేజ్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

కేసముద్రం విలేజ్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
కేసముద్రం, ఆంధ్రప్రభ:
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్‌లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాసాడి శ్రీనివాస్, మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సొసకండ్ల సుభాష్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ గుండు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెండాల లక్ష్మణ్, గుబ వెంకన్న, కీర్తి సంపత్, బైరు వెంకటేశ్వర్లు, కీర్తి సారయ్య, ఎస్.కే యాకుబీ, ఉల్లిగడ్డ వెంకటేశ్వర్లు, గుండు సాయిలు, కొలిపాక శ్రీనివాస్, లక్కాకుల సత్యనారాయణ, దీకొండ యాదగిరి తదితరులు ఈ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
