చల్లపల్లిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చల్లపల్లిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చల్లపల్లి, ఆంధ్రప్రభ: చల్లపల్లిలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చల్లపల్లి ఆటోనగర్ సమీపంలోని కల్వర్టుపై మహిళ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఆమె విగతజీవిగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
