రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి

రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి

  • డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి

మునుగోడు, ఆంధ్రప్రభ : కల్వకుంట్ల నుంచి వెల్మకన్నె వరకు మంజూరైన బి టి రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి డిమాండ్ చేశారు.ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు ఉపఎన్నికల సమయంలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి రహదారికి శంకుస్థాపన చేసినప్పటికీ రెండేళ్లు గడిచినా పనులు పూర్తికాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగిన నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుంటూ పనులు చేస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ రహదారి పూర్తయితే గ్రామానికి బస్సు సౌకర్యం రావడంతో పాటు గట్టుప్పల్ మండలానికి రాకపోకలు సులభమవుతాయని, వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.రానున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఏ ముఖంతో ప్రజల వద్దకు వెళ్తారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రహదారి పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని,లేనిపక్షంలో గ్రామ ప్రజలను ఏకం చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కట్ట ఆంజనేయులు,మండల ఉపాధ్యక్షులు కట్ట వెంకన్న,పీఎన్‌ఎమ్ నాయకులు పగిళ్ల యాదయ్య,గ్రామ నాయకులు అశోక్, కార్తీక్,గణేష్,సాయి తేజ, రామ్ చరణ్,గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.