మంత్రి తుమ్మలకు ఘన సన్మానం..

దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో శుక్రవారం మొట్టమొదటిసారి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 40 వసంతాలు పూర్తి చేసుకున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను పలువురు కలుసుకొని, సన్మానించి తమ శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో మంత్రి తుమ్మల చేసిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కలగజేయాలని, భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి తుమ్మలను కలిసిన వారిలో తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామ చంద్ర ప్రసాద్, మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కె.వి. సత్యనారాయణ ,దొడ్డాకుల రాజేశ్వరరావు ,కాసాని నాగ ప్రసాద్ , మన్నెం అప్పారావు ,ఎర్రా వసంతరావు తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, అశ్వారావుపేట నియోజక వర్గ నాయకులు తదితరులు ఉన్నారు.
