Jannaram | సాంప్రదాయాలను గౌరవించాలి

Jannaram | సాంప్రదాయాలను గౌరవించాలి

  • ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

Jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ వీర్లగుట్టపై శ్రీ కేతేశ్వర కంకాలమ్మ శివాలయం ఆవరణలో నిర్వహించిన జాతర కార్యక్రమానికి ఈ రోజు మధ్యాహ్నం ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ తర్వాత ఆ దేవాలయంలో ఎమ్మెల్యేకు పూజారి భూమన్న స్వామి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆలయం ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ ప్రధాన రహదారి నుండి ఆలయం వరకు రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఉదయం ఆలయంలో హరిహర భారత్ గ్యాస్ యజమాని మిక్కిలినేని రాజశేఖర్ -పద్మజవల్లి, గ్రామ సర్పంచి జక్కు సుష్మ-భూమేష్ దంపతులు పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన నగురు అంజయ్య-శంకరవ్వ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ లక్ష్మీనారాయణ, లక్షేటిపేట సీఐ రమణమూర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజాఫర్, మాణిక్యం,సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, ఆలయ కమిటి చైర్మన్ నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు చిలివేరి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కోడిజుట్టు రాజన్న, కోశాధికారి పిల్లి మల్లయ్య, ఉపాధ్యక్షుడు కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.