Dry Fruits | రోజూ తింటే ఉప‌యోగాలెన్నో..!

Dry Fruits | రోజూ తింటే ఉప‌యోగాలెన్నో..!

Dry Fruits | ఉదయం బాదం తింటే ఎందుకు మంచిది?
బాదంలో ఉన్న పోషకాలు
బాదం తింటే కలిగే ప్రయోజనాలు
బాదం ఎలా తినాలి?
రోజుకు ఎంత బాదం తినాలి?
బాదం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Dry Fruits | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా ఎక్కువ మంది బాదం పప్పును తింటున్నారు. బాదం పప్పు తినడానికి రుచిగా ఉంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. మార్నింగ్ తిన‌డం వ‌ల్ల శరీరం బాదంపప్పులో ఉండే పోషకాల్ని త్వరగా గ్రహిస్తుంది. ఇది మెదడును పదునుపెడుతుంది. వ్యాయామం చేసే వారు వ్యాయామానికి ముందు బాదం తినడం మంచిది. కండరాలు బ‌లంగా ఉండ‌టానికి సాయపడతాయి. రాత్రిపూట బాదం తినడం వల్ల బరువు తగ్గవచ్చు. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో బాదం తినడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.

ఇందులో విటమిన్ E, మెగ్నీషియం, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి చర్మ సంరక్షణకు ఉపయోగపడటంతోపాటు గుండె సమస్యల బారిన పడకుండా బీపీని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. బాదంలో ఉండే ఫైబర్.. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్​ను మరింత స్థిరంగా ఉంచుతుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో బాదం పప్పులు రోజుకు 6 నుంచి 7 వరకు తినొచ్చని సలహా ఇస్తున్నారు. వీటిని నేరుగా కంటే నానబెట్టినవి తినడం వల్ల పోషకాలు అధికంగా అందుతాయని తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ బాదం పప్పులను తీసుకోవడం వల్ల గుండె, పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది.

బాదం తింటే ఉపయోగాలు

  • గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • మెదడు పనితీరుకు మంచిది, జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది
  • ఎక్కువసేపు ఆకలి తగ్గించి బరువు నియంత్రణకు సహాయపడుతుంది
  • చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ E సహకరిస్తుంది
  • రక్తంలో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడవచ్చు
  • ఎముకల బలానికి మ్యాగ్నీషియం, కాల్షియం సహాయపడతాయి

ఎలా తినాలి?

  • రాత్రి 5–10 బాదం నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి తినడం సాధారణంగా మంచిదిగా భావిస్తారు
  • నేరుగా కూడా తినవచ్చు
  • పాలు, ఓట్స్, స్మూతీ, డ్రైఫ్రూట్ మిక్స్‌లో కలిపి తినొచ్చు
  • బాదం వెన్న రూపంలో కూడా తీసుకోవచ్చు

ఎంత తినాలి?

  • రోజుకు సాధారణంగా 5–10 బాదాలు చాలును
  • ఎక్కువగా తింటే కేలరీలు అధికమవుతాయి

జాగ్రత్తలు

  • నట్స్ అలర్జీ ఉన్నవారు తినకూడదు
  • కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి

CLICK HERE TO READ 100milliliters | మిల్క్ బ్యాంకులపై అవగాహనకు గుత్తా జ్వాల సందేశం!

CLICK HERE TO READ MORE

Leave a Reply