విభిన్న ప్రతిభావంతులకు పంపిణీలు

విభిన్న ప్రతిభావంతులకు పంపిణీలు

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పలువురు విభిన్న ప్రతిభావంతులకు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ALIMCO, IOCL వారి సహకారంతో రూ. 1కోటికి పైగా విలువైన CSR నిధుల ద్వారా బ్యాటరీ ట్రై సైకిళ్లను, వీల్ చైర్లను, 512 ఉపకరణాలు, పరికరాలను అందజేసిన కార్యక్రమం స్థానిక TJPS కాలేజీలో శనివారం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ శరీరానికి పరిమితులు ఉంటాయేమో గాని, సంకల్పానికి పరిమితులు ఉండవు. CSR నిధుల ద్వారా ఈ ట్రై సైకిళ్లు అందిస్తున్న ఐఓసీఎల్ ప్రతినిధులకు, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్న ALIMCO ప్రతినిధులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం సుమారు 810 మందికి సుమారు రూ. 18.80 లక్షలతో కొన్ని ఉపకరణాలు అందజేశాము. ఇప్పుడు మరో 200 మందికి కలిపి మొత్తం 1000 మందికి పైగా సుమారు రూ. 1కోటికి పైగా విలువైన ఉపకారణాలను, పరికరాలను అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉచిత బస్సు, పెన్షన్ల పంపిణీ, ప్రోత్సాహకాలు అన్ని చేస్తున్నారంటే, అది ముఖ్యమంత్రి గారికి ఉన్న మంచి మనసు మాత్రమే కారణం. విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఎదగడంపై దృష్టి సారించాలి. డిల్లీ కి చెందిన ఐరా సింఘాల్ పోలియో పాడిన పడిన సరే ఐఏఎస్ టాపర్ గా నిలిచారు. అలాగే ప్రమోద్ భగత్ పోలియో బారిన పడినా సరే, పారా బ్యాడ్మింటన్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీకాంత్ ఇలాంటి ఎందరో విభిన్న ప్రతిభావంతులైనప్పటికీ తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇలాంటి వారి అందరిని స్ఫూర్తిగా తీసుకొని, మీరు కూడా మీలో ఉన్న ప్రతిఫలం పదునుపెట్టి ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలి. విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన ఉపకరణాలు పరికరాల సర్వీస్ సెంటర్ కు సంబంధించి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సర్వీస్ సెంటర్ కావాలని చేసిన ప్రతిపాదనలు చేశారు. PM దివ్యషా వయో శ్రీ కేంద్ర పథకం ద్వారా త్వరలోనే అమలులోకి తీసుకువచ్చి విభిన్న ప్రతిభావంతులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.

ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నాయకులు చాలామందికి అందరికీ న్యాయం చేయాలని ఆరాటం ఉంటుంది అన్నారు. ఆ ఆరాటాన్ని అమలు చేసే నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రముఖులు అన్నారు. మీ విభిన్న ప్రతిభావంతులు ఇతరులకు సామాన్యులకు ఏమాత్రం తీసుకోరని రుజువు చేస్తూ అందరితో సమానంగా చూడగలం నాయకులు పెమ్మసాని అని కొనియాడారు.

ఎమ్మెల్యే నసీర్ అహ్మద్..

విభిన్న ప్రతిభావంతులను మరింత ప్రతిభావంతులుగా మార్చే ప్రయత్నం పెమ్మసాని చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. మీరు ఏ ఒక్కరి పైనా ఆధారపడకుండా టెక్నాలజీని, ఉపయోగించుకోవడంలో గాని చదువుకోవడంలో గాని, మీకు ఎక్కువ ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెట్టడం గాని చేస్తూ ముందుకు సాగాలి.ఈ కార్యక్రమంలో IOCL జనరల్ మేనేజర్ వర్గీస్ చరియన్ గారు, ALIMCO సంస్థ ప్రతినిధులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ , స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ , రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు , వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గడుపాటి నారాయణస్వామి, టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు , ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు , టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు, కార్పొరేటర్ వరప్రసాద్ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply