మానేర్ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికతీత చేపట్టాలి..
మానేర్ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికతీత చేపట్టాలి..
ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించిన నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి
సిరిసిల్ల , ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చరిత్రాత్మక ఎగువ మానేరు ప్రాజెక్ట్ దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది .ఈ ప్రాజెక్టు సరైన నిర్వహణ లేక శిధిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థకు చేరిన నర్మల ప్రాజెక్టును రక్షించాలని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు బుధవారం నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎగువ మానేరు పై నిర్మించిన నర్మల ప్రాజెక్టుపై ఆధారపడిన రైతాంగం 18 వేల ఎకరాలు నష్టపోయే ప్రమాదం ఉందని గతంలో వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న ఆప్రాన్ పూర్తిగా కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రాజెక్టు పునాదులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని యుద్ధ ప్రాతిపదికన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆఫ్రాన్ నిర్మాణం చేపట్టవలసిన అత్యవసరం ఉందన్నారు. ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల సమయంలో ప్రవాహ ఉధృతిని తగ్గించడం అవసరమైన నీటి తోట్లు శాస్త్రీయంగా నిర్మించాలని గొలుసుకట్టు కాలువలు శిధిలమైనవి వాటిని పునః ద్దరించాలని కాలువలకు ఉన్న షెటర్లు తుప్పు పట్టి విరిగిపోయి ఉన్నందున వాటిని మార్చాలని కోరారు. కాల్వలకు గండ్లు పడకుండా ఇరువైపులా ప్రతిష్టమైన లైనింగ్ బంధభస్తు పనులు చేపట్టాలని మరమ్మత్తులు చేపట్టకపోవడం వల్ల దశాబ్దాలు గా కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న మట్టి ఇసుక కారణంగా ప్రాజెక్టులోకి సగానికి పైగా పూడిక పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిక తీయాలని స్థానిక రైకంగం ఆందోళన చెందుతుందన్నారని మానవతా దుకృతంతో నర్మాల ఎగువ మానేర్ లో పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవడం కోసం ప్రాజెక్ట్ లో పూడిక తీయడంతో పాటు మరమ్మత్తు పనులు చేపట్టాల్సిందిగా కమిటీ డిమాండ్ చేసింది. వినతి పత్రాన్ని స్వీకరించిన విప్ ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో నర్మాల ప్రాజెక్ట్ పరి రక్షణ సమితి కన్వీనర్ గుఃటి వేణు కో కన్వీనర్ లు చాకలి రమేష్ , బొజ్జ కనకయ్య, మార్వాడి సుదర్షన్ చెన్నమనేని పురుషోత్తం రావు, బండారి బాల్ రెడ్డి, చెక్కపల్లి శ్రీనివాస్, గడ్డం వరలక్ష్మీ, లు కలిసి వినతిపత్రం అందజేశారు,
